అక్షయ్ కుమార్‌ను చిక్కుల్లో పడేసిన పాత వీడియో


ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తన పౌరసత్వంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కెనడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన పాత వీడియో మరోసారి బయటకొచ్చి మరింత చర్చను లేవదేసింది. అక్షయ్ కుమార్ ఇటీవల మాట్లాడుతూ తనకు కెనడా పౌరసత్వం ఉన్నట్టు అంగీకరించాడు.
 
ఈ విషయంలో అనవసర రాద్దాంతం అవసరం లేదని, చర్చలకు ఇక ఫుల్‌స్టాప్ పెట్టాలన్న అక్షయ్.. తనకు కెనడా పౌరసత్వం ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ గత ఏడేళ్లలో తానెప్పుడూ అక్కడికి వెళ్లలేదన్నాడు. అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అక్షయ్‌కు చెందిన ఓ పాత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
 
కెనడాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ మాట్లాడుతూ.. తన సొంతిల్లు టొరంటోనేనని, సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇక్కడే స్థిరపడతానని చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది. ఇక్కడికే వస్తానని, ఇక్కడే మీతోనే ఉంటానని అక్షయ్ పేర్కొన్నాడు. అక్షయ్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని నెటిజన్లు తూర్పారబడుతున్నారు.
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *