అక్షయ్ కుమార్‌పై వ్యంగ్యంగా స్పందించిన ప్రముఖ హీరో


న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. తనకు కెనడా పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన తన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే అక్షయ్ కుమార్ లక్ష్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఓ వీడియోలో ‘కెనడా నా ఇల్లు’ అంటూ బాలీవుడ్ హీరో వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియోను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అక్షయ్ కుమార్ దేశ భక్తిని ప్రశ్నిస్తున్నారు. కాగా.. అక్షయ్ కుమార్, ప్రధాని మోదీని ఇంటర్యూ చేయడంపట్ల వ్యంగ్యంగా స్పందించిన ప్రముఖ హీరో సిద్ధర్థ్ ‘డొనాల్డ్ ట్రంప్ గారు, నాకు భారతదేశ పౌరసత్వం ఉన్నప్పటికీ మీ ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని ఇంటర్యూ చేయాలనుకుంటున్న’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *