అడవి పందుల అక్రమ రవాణా.. కొండపల్లి ఫారెస్టులో వదిలేసిన అధికారులు


విజయవాడ: అడవి పందులను అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను గురువారం ఇబ్రహీంపట్నం ఫారెస్టు చెక్‌ పోస్టు వద్ద అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 అడవి పందులు స్వాధీనం చేసుకున్నారు. నిజమాబాద్‌ నుంచి గన్నవరం ట్రాలీలో అడవి పందులను నిందితులు తరలిస్తున్నారు. జగ్గయ్యపేట రేంజ్‌ ఆటవీశాఖ అధికారి బి.లెనిన్‌ సిబ్బందితో ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌లో వాహనంను అడ్డుకుని పశ్చిమ ఇబ్రహీంపట్నం వైద్యశాలకు తరలించి అడవి పందుల అని పశువైద్య అధికారులు నిర్ధారించారు. అనంతరం పందులను కొండపల్లి ఫారెస్టులో వదలిపెట్టారు. నిందితులపై అటవీశాఖ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *