అధికారంలోకి వచ్చాక.. అవన్నీ సరిదిద్దుతాం: సిద్ధరామయ్య


బెంగళూరు: మోదీ సర్కార్‌పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. రైలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో విద్యార్థులు నీట్ పరీక్ష రాయలేకపోయారని.. మోదీ ప్రభుత్వ విధానాల వల్లే వారు నష్టపోయారని వాపోయారు. ఎవరో సాధించిన విజయాలు తనవని విర్రవీగడం సరికాదని ప్రధానిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఈ కొద్దిరోజులైనా సరిగా పనిచేయమని చెప్పండని, తాము అధికారంలోకి వచ్చాక అవన్నీ సరిదిద్దుతామన్నారు.
 
హంపీ ఎక్స్‌ప్రెస్(16591) ఆలస్యంగా బెంగళూరు చేరడంతో 500 మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయలేకపోయిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థులు సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో కన్నడ నాట నేతలు తమదైన శైలిలో స్పందించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *