అధికారులు పొరపాటుతో వారికి రెండుసార్లు ఓటుహక్కు


కోల్‌కతా: లోక్‌‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఏడు సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొన్ని విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మొరాయించగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా బైరక్‌పూర్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని బీజాపూర్ బూత్ నంబర్ 116లో కొంతమంది ఓటర్లు రెండుసార్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యాక అప్పటివరకూ పోలయిన ఓట్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మాక్‌పోల్‌లో నమోదైన 86 ఓట్లను తొలగించలేదన్న సంగతిని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో అధికారులు అప్పటి వరకూ పడిన ఓట్లనన్నింటినీ తొలగించి, తిరిగి ఓటర్లను వారి ఇళ్ల నుంచి రప్పించి వారిచేత మరోమారు ఓటు వేయించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *