అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు


విజయవాడ: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎం పరిశీలిస్తున్నారు.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన విషయం తెలిసిందే. శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైంది. తీరంవైపు 45 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించారు. మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశముంది. ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపారు. దీనికి ఫణిగా నామకరణం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *