అధికారుల నిర్లక్ష్యం: పిల్లల చేతికి ఈవీఎంలు, వీవీప్యాట్‌లు


పట్నా: బీహార్‌లో ఆరవదశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు చిన్నారుల చేతికి ఆ పనిని అప్పగించిన ఉదంతం వెలుగు చూసింది. ఎన్నికల ప్రక్రియలో ఎంతో కీలకంగా ఉండే ఈవీఎంలు, వీవీప్యాట్లను బాలకార్మికుల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు మీడియా కంటికి చిక్కాయి. కాగా ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని కొట్టిపారేశారు. కాగా మీడియాకు చిక్కిన దృశ్యాల్లో ఎన్నికల అధికారులు వాహనం దగ్గర నిలుచుండగా, 8, 9 ఏళ్ల బాల కార్మికులు ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు ఛప్రాలోని జయప్రకాష్ ఇంజినీరింగ్ కాలేజీ పరిసరాల్లో మీడియాకు కనిపించాయి. ఇక్కడ పోలింగ్ పార్టీలకు ఈవీఎంలను జాగ్రత్తగా తరలించడం, పోలింగ్ ముగిశాక తిరిగి ఈవీఎంలను భద్రపరచడం తదితర బాధ్యతలను అప్పగించారు. అయితే అధికారులు ఈవీఎంలను, వీవీప్యాట్‌లను మండుటెండలో బాలకార్మికుల చేత తరలింపజేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *