అనంతనాగ్‌లో మందకొడిగా పోలింగ్… బరిలో మహబూబా ముఫ్తీ


శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడవ దశలో అనంతనాగ్ పార్లమెంట్ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. అయితే పోలింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచి మందకొడిగానే ఉన్నట్టు సమాచారం. జమ్ముకశ్మీర్‌లో అనంతనాగ్ అత్యంత సున్నిత ప్రాంతంగా పేరొందింది. ఈ కారణంగా ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో పాటు మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లోని ఓటర్లు ఓటువేసేందుకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. రాష్ట్ర పోలీసుల వినతి మేరకు ఎన్నికల కమిషన్ అనంతనాగ్‌లో పోలింగ్ సమయాన్ని రెండు గంటలు తగ్గించింది. దక్షిణ కశ్మీర్‌లో ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *