అనంతపురం: గోరంట్లలో విషాదం


అనంతపురం: గోరంట్లలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పొలంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందులో ఇద్దరు సోమశేఖర్(28), మోహన్‌(25) మృతి చెందగా.. రామకిష్టమ్మ, వేణుగోపాల్‌ అపస్మారక స్థితిలో ఉండగా వారిని కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్తి పంపకాల్లో మనస్పర్ధలే కారణంగా తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *