అప్పుడలా.. ఇప్పుడిలా..


  • ప్రమోషన్‌ కోసం ఇస్లాంలోకి రాజస్థాన్‌ ఐఏఎస్‌
  • ఎన్నికల్లో పోటీ కోసం మళ్లీ హిందూత్వంలోకి
జైపూర్‌, ఏప్రిల్‌ 18: మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పదోన్నతి పొందడం కోసం ఆయన హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం మళ్లీ హిందూత్వంలోకి వచ్చేశారు. ఆయనే రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఉమ్రావ్‌ సలోదియ. మూడేళ్ల క్రితం ఆయన ఇస్లాంలోకి మారి, తన పేరును ఉమ్రావ్‌ ఖాన్‌గా మార్చుకున్నారు. దానిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దాంతో ఆయన రిటైర్మెంటుకు ముందే పదవి నుంచి వైదొలిగారు. అయితే, ఇప్పుడు ఆయన జైపూర్‌ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో దిగారు. ఇటీవల సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో తాను హిందువునని పేర్కొనడం గమనార్హం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *