అభినందన్‌‌ను‌‌‌ బదిలీ చేసిన ఐఏఎఫ్..!


న్యూఢిల్లీ: పాక్ ఎఫ్-16 విమానాన్ని కూప్పకూల్చివేసి, పొరపాటున శత్రుదేశ భూభాగంలో పట్టుపడిన రెండ్రోజుల తర్వాత తిరిగి భారత్‌లో అడుగుపెట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌‌ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో చోటుకి బదిలీ చేసినట్టు సమచారం. ఇప్పుటి వరకూ విధులు నిర్వహిస్తున్న శ్రీనగర్ ఎయిర్‌బేస్ నుంచి పాకిస్థాన్ సరిహద్దుల్లోని వెస్ట్రన్ సెక్టార్‌కు ఆయనను బదిలీ చేసినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. భద్రతా కారణాల రీత్యా ఐఏఎఫ్ ఈ బదిలీ చేపట్టినట్టు ఆ కథనం పేర్కొంది.
 
కాగా, నాటి ఘటనలో గాయపడిన వర్దమాన్ కొద్ది వారాలుగా వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ విధుల్లోకి చేరనున్నట్టు కూడా ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. అయితే, విధుల్లో చేరడానికి ముందు బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇటీవల కొద్దివారాల పాటు వరుస వైద్య పరీక్షలు చేయించుకున్న అభినందన్‌కు రాబోయే వారాల్లో ఐఏఎం మరికొన్ని పరీక్షలు నిర్వహించనుంది. అభినందన్ ఉత్సాహం, విధుల్లోకి చేరాలనే పట్టుదల చూస్తుంటే త్వరలోనే ఆయన మళ్లీ యూనిఫాం వేసుకునే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్టు ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు తాజాగా తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *