అమిత్‌షా రాకముందే బీజేపీ కార్యాలయాన్ని పేల్చివేసిన నక్సల్స్…


ఖుంటి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జార్ఖండ్ పర్యటనకు కొద్ది గంటల ముందు మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. సరాయికేలా జిల్లాలోని ఖర్‌సావాం బీజేపీ కార్యాలయాన్ని పేల్చివేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక 12:30 గంటల ప్రాంతంలో నక్సలైట్లు బీజేపీ కార్యాలయాన్ని పేల్చివేసినట్టు సమాచారం. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత అర్జున్ ముండా ఖర్‌సావాం కార్యాలయం నుంచే పనిచేయడం గమనార్హం. ప్రస్తుతం ఖుంటి లోక్‌సభ స్థానం నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు. ఖర్‌సావాం కూడా ఖుంటి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది.
 
బీజేపీ చీఫ్ అమిత్ షా ఇవాళ ఖుంటి, కేడెర్మా, రాంచీ సహా జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. జార్ఖండ్‌లో మొత్తం 14 లోక్‌సభ నియోజక వర్గాలుండగా… ఖుంటిని ఎస్టీలకు కేటాయించారు. ప్రస్తుతం బీజేపీ నేత కరియా ముండా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఐదో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 6న ఖుంటిలో పోలింగ్ జరగనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *