అమెరికాలో సంచలనం…ఓ ఇంట్లో వెయ్యికిపైగా తుపాకులు స్వాధీనం


వాషింగ్‌టన్ డీసీ : అమెరికా దేశంలో సంచలన ఘటన వెలుగుచూసింది. లాస్ ఏంజెల్స్ నగరంలోని విలాసవంతులున్న ప్రాంతంలోని ఓ ఇంట్లో వెయ్యికిపైగా తుపాకులను లాస్ ఏంజెల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లోని బెల్ ఎయిర్, హోల్‌బీ ప్రాంతాల్లో ఓ వ్యక్తి అక్రమంగా తుపాకులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో తాము ఆకస్మిక తనిఖీలు చేశామని లాస్ ఏంజెల్స్ పోలీసు అధికారి జెఫ్ లీ చెప్పారు. అధికారులు తనిఖీలు చేయగా వందలాది రైఫిళ్లు, హ్యాండ్ గన్స్ కనిపించాయి. వెయ్యికి పైగా తుపాకులను ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని లాస్ ఏంజెల్స్ పోలీసులు వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *