అమ్మకానికి ‘మోదీ బంగారు రింగులు’… 12 రాష్ట్రాల్లో లభ్యం


న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫొటోలతో కూడిన హోర్డింగులు, పోస్టర్లు, దుస్తులతో పాటు నిత్యావసర వస్తువులు మార్కెట్‌లో కనిపిస్తుంటాయి. అయితే గుజరాత్‌లో ఇప్పుడు ఈ స్థాయి దాటిపోయింది. రాజ్‌కోట్‌లో ప్రధాని మోదీ ఫొటో కలిగిన బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నారు. రాజ్‌కోట్‌లోని సోనీ‌బజార్ దేశవ్యాప్తంగా ఎంతో పేరొందింది. ఇక్కడే ప్రధాని మోదీ ముఖచిత్రం కలిగిన రింగులను డిజైన్ చేశారు. దీనిలో బీజేపీ చిహ్నమైన కమలం గుర్తుతో పాటు మోదీ ముఖచిత్రం కూడా ఉంది. ఈ ఉంగరాలు ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఈ ఉంగరాలు గుజరాత్‌లోనే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు 12 రాష్ట్రాల్లో లభ్యమవుతున్నాయి. ఈ ఉంగరాలను బంగారంతోనే కాకుండా వెండితోనూ రూపొందిస్తున్నారు. వీటి ధర వెయ్యి రూపాయలు మొదలుకొని రూ. 30 వేల వరకూ ఉంటోంది. ప్రస్తుతం ఈ రింగులకు ఎంత డిమాండ్ పెరిగిందంటే… 24 గంటల పాటూ స్వర్ణకారులు వీటిని తయారు చేయడంలో మునిగిపోయారు. అయినప్పటికీ డిమాండ్‌కు తగిన విధంగా మోదీ ఉంగరాలను రూపొందించలేకపోతున్నామని చెబుతున్నారు. ఇదిలావుండగా కొన్ని నెలల క్రితం సూరత్‌లో ప్రధాని మోదీ చిత్రంతో కూడిన చీరలను రూపొందించారు. ఆ తరువాత కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక ఫొటోలతో కూడిన చీరలను కూడా తీర్చిదిద్దారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *