అమ్మ సన్నిధిలో సరస్వతీ యాగం


విద్యార్థుల పూజలు..
విజయవాడ (చిట్టినగర్‌): చదువుల తల్లి సరస్వతిదేవి జన్మనక్షత్రం మూలనక్షత్రాన్ని పురస్కరించుకొని మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద గల యాగశాలలో బుధవారం మహాసరస్వతి హోమాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. యాగం అనంతరం విద్యార్థులకు ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, విద్యార్థులకు కలం, అమ్మవారి పాకెట్‌ ఫొటో, కంకణం, ప్రసాదం పంపిణీ చేశారు.
 

అన్నదాన పథకానికి రూ 1,01,116 విరాళం..
ఇంద్రకీలాద్రిపై వేంచేసివున్న కనకనదుర్గమ్మ అమ్మవారి అన్నదాన పథకానికి విజయవాడ నగరానికి చెందిన ఎ.రాంబాబు రూ 1,01,116లు విరాళంగా ఈవో కోటేశ్వరమ్మకు బుధవారం అందజేశారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి క్యాలెండర్‌, ప్రసాదాలను అందజేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *