అరుణాచల్‌‌ప్రదేశ్, నేపాల్‌లలో భూకంపం


న్యూఢిల్లీ : అరుణాచల్‌‌ప్రదేశ్, నేపాల్‌లో బుధవారం భూకంపం సంభవించింది. అరుణాచల్‌‌ప్రదేశ్ లోని పశ్చిమ సియాంగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.45 గంటలకు భూమి కంపించింది. అరుణాచల్‌‌ప్రదేశ్ లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. అరుణాచల్‌‌ప్రదేశ్ లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జియాలజికల్ సర్వే అధికారులు ప్రకటించారు. దిబ్రూఘడ్ పట్టణం కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం 114 కిలోమీటర్ల దూరం వచ్చిందని అధికారులు చెప్పారు. టిబెట్ దేశ సరిహద్దుల్లో వచ్చిన ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు. అసోం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతంతోపాటు చైనా సరిహద్దుల్లో భూప్రకంపనలు వచ్చాయి. నేపాల్ దేశంలోని ఖాట్మండు కేంద్రంగా బుధవారం ఉదయం 6.14 గంటలకు భూమి కంపించింది. నేపాల్‌లోని ధడేంగ్ జిల్లా నౌబైస్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *