ఆంటొనోవ్ కార్గో విమానాన్ని అడ్డుకున్న ఐఏఎఫ్ సుఖోయ్‌లు


జైపూర్: పాకిస్థాన్ వైపు నుంచి అనుమతి లేని వాయుమార్గంలో భారత భూభాగంలోకి ప్రవేశించిన జార్జియన్ ఆంటొనోవ్-12 కార్గో విమానాన్ని భారత వాయిసేన  అడ్డుకుంది. ఐఏఎఫ్ సుఖోయ్‌లు కార్గో విమానాన్ని అడ్డుకుని జైపూర్ ఎయిర్‌ బేస్‌లో బలవంతంగా దించేసిన కీలక ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. సాయంత్రం 4.55 గంటలకు జైపూర్‌లో కార్గో విమానాన్ని, సిబ్బందిని దించి అధికారులు ప్రశ్నించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
కచ్ ప్రాంతంలోని రణ్‌లో కీలకమైన ఎయిర్ బేస్‌కు 70 కిలోమీటర్ల ఉత్తరంగా ఎఎన్-12 కార్గో భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని అధికారులు గుర్తించినట్టు ఆ వర్గాలు చెప్పాయి. కాగా, విమానంలో ఉన్న సామగ్రిని తనిఖీ చేసేందుకు ఐఏఎఫ్ తమ బృందాన్ని జైపూర్‌కు పంపింది.
 
కార్గో విమానాన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ తమ రాడార్లలో గుర్తించడంతో, రెండు ఎయిర్ డిఫెన్స్ ఫైటర్లు ఎస్‌యూ-30ఎంకేఐలను అక్కడకు పంపిందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. తొలుత జార్జియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అయితే జైపూర్‌కు 60 కిలోమీటర్ల సమీపంలో కిందకు దిగుతూ ల్యాండ్ అయిందని వారు చెప్పారు. కాగా, ఈ భారీ కార్గో ప్లాన్‌ను ఉక్రెయిన్ ఇంజన్ తయారీ సంస్థ ‘మోటార్‌సిచ్’ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *