ఆజంఖాన్‌పై జయప్రద సంచలన వ్యాఖ్యలు


రాంపూర్ : రాంపూర్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ పై బీజేపీ అభ్యర్థి, ప్రముఖ సినీనటి జయప్రద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాంపూర్ ఎన్నికల్లో ఎప్పుడూ ఆజంఖాన్ రిగ్గింగ్ చేసి విజయం సాధిస్తున్నాడని జయప్రద ఆరోపించారు. తన రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లిములను ఓటేసేందుకు అధికారులు రానీయలేదని ఆజంఖాన్ విమర్శించిన నేపథ్యంలో జయప్రద ఆ విమర్శలను తిప్పి కొడుతూ ఆజంఖానే ఎన్నికల్లో రిగ్గింగుకు పాల్పడ్డాడని ఆరోపించారు. రాంపూర్ లోని ప్రతీ పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓటర్లు ఉన్నారని, గడచిన 20 ఏళ్లుగా ఆజంఖాన్ నకిలీ ఓట్లతోనే ఎన్నికల్లో గెలిచారని జయప్రద విమర్శించారు. వారం రోజులుగా ముస్లిముల ఇళ్లను దోచుకున్నారని, అధికారులు, పోలీసులు ముస్లిములను కొట్టారని ఆజంఖాన్ ఆరోపించారు. ముస్లిములకు ఏ అధికారి సంతకం లేకుండా రెడ్ కార్డులు జారీ చేశారని, వారు ఓటేసేందుకు బయటకు రావద్దని పోలీసులు ఆదేశించారని ఆజంఖాన్ పేర్కొన్నారు. మరోవైపు ముస్లిమ్ ప్రాబల్య ప్రాంతాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *