ఆదాయంలోనూ… ముందే


  • 2017-18 కంటే 69 శాతం వృద్ధి
  • సరుకు రవాణ రూపంలో గణనీయంగా పెరిగిన రైల్వే ఆదాయం
  • ప్రయాణికుల టికెట్‌ చార్జీల ద్వారా నూ రాబడి పెరుగుదల
గుంటూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే డివిజన్‌ కొత్త సర్వీసులను అమలు చేయడంలోనే కాకుండా ఆదాయ పరంగానూ గణనీయమైన పురోగతి సాధిస్తో న్నది. గత ఏడాది కంటే సరుకు రవాణ విషయంలో భారీగా ఆదాయాన్ని మూట గట్టుకొన్నది. డివిజన్‌ ఏర్పడినతర్వాత రికార్డు స్థాయిలో సరుకు రవాణ ఆదాయం రావడం రైల్వేవర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతో న్నది. మరోవైపు ప్రయాణికుల టికెట్‌ల ద్వారా కూడా గత ఏడాది కంటే అదనపు ఆదాయం సమకూరింది. సండ్రీస్‌, క్యాటరింగ్‌ సర్వీసులు, తుక్కు డిస్పోజల్‌ ద్వారా కూడా ఆదాయం రావడం విశేషం. ఇదే ఉత్సాహాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కనబరిచి రైల్వే ఆదాయాన్ని మరింతగా పెంచుతామని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
2017-18 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ. 158.83 కోట్ల ఆదాయం గుంటూరు రైల్వే డివిజన్‌కి వచ్చింది. 2018- 19 ఆర్థిక సంవత్సరంలో ఇది 69శాతం పెరిగి రూ.267.54 కోట్లకు చేరుకొన్నది. దక్షిణమధ్య రైల్వే జోన్‌ నిర్దేశించిన లక్ష్యంగా కంటే ఇది 13 శాతం అధికం కావడం విశేషం. ప్రధానంగా డివిజన్‌ పరిధిలో సిమెంట్‌, సున్నపురాయి రవాణా ద్వారా ఆదాయం వచ్చింది. ఒక్క జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌ ద్వారానే రూ.33.31 కోట్ల రాబడి నమోదైంది. ఆ సంస్థతో డివిజ నల్‌ రైల్వే మేనేజర్‌ వీజీ భూమా తరచుగా సంప్రదింపులు జరిపారు. దేశం లోని వివిధ ప్రదేశాలకు 56 రేక్‌లు(గూడ్స్‌లు) సిమెంట్‌ని ఇక్కడి నుంచి రవాణా చేశారు. అలానే గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పండిన జొన్నలని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగు మతి చేయడం ద్వారా రూ.1.80 కోట్ల ఆదాయం సమకూరింది.
 
అమరావతి రాజధాని నగరం కారణంగా డివిజనల్‌ అధికారులు జోన్‌ల్‌ ఉన్నతాధి కారులపై డిమాండ్‌ చేసి ప్రత్యేక రైళ్లు, జనసాధారణ రైళ్లను గుంటూరు డివిజన్‌ మీదగా నడిపేలా చేశారు. ప్రధానంగా దసరా, కొత్త సంవత్సరం, దీపావళి, సంక్రాంతి పండగల సమయంలో సికింద్రా బాద్‌ నుంచి గుంటూరుకు పుష్కలంగా రైలు సర్వీసులు నడిపారు. అలానే శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదగా మళ్లించారు. నేటికీ కొన్ని స్పెషల్‌ ట్రైన్స్‌ నంద్యాల, నడికుడి మార్గంలో రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. హోసన్నా మందిరం, బైబిల్‌మిషన్‌ మహాసభ లకు ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటిన్నింటి వల్ల ప్రయాణికుల ద్వారా రూ.149.9 కోట్ల ఆదాయం వచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.143.68 కోట్లు వచ్చింది. సండ్రీస్‌ రూపంలో రూ.11.68 కోట్లు, క్యాటరింగ్‌ సర్వీసెస్‌ ద్వారా మరో రూ. కోటికి పైగా ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. ఇవన్నీ డివిజన్‌ ఆదాయం పెరుగుదలకు దోహద పడినట్లు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ వీజీ భూమా తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *