ఆమెకు నోటాకు మించి ఓట్లు వస్తే సంతోషమే: ఖుష్బూ


చెన్నై(ఆంధ్రజ్యోతి): తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌ ‘నోటా’ ఓట్ల కంటే అధికంగా ఓట్లు సాధిస్తే తనకు సంతోషమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ ఎద్దేవా చేశారు. చెన్నైలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేరళ, కర్నాటక, ఆంధ్రా, తెలంగాణా, ఒడిసా రాష్ర్టాలలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేసి వచ్చానని, త్వరలో ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేయనున్నానని చెప్పారు. తాను పర్యటించిన రాష్ట్రాలలో ప్రధాని మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీకి ప్రస్తుతం ఓటమి భయం పట్టుకోవడం వల్లే కాంగ్రెస్‌ నేతలపైనా, కాంగ్రెస్‌ మాజీ ప్రధానుల పైనా పనిగట్టుకుని బురుద జల్లే విధంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను ప్రధాని మోదీ విమర్శిస్తూ రాహుల్‌ తండ్రి రాజీవ్‌గాంధీ అవినీతి పరుడిగానే మృతి చెందారని చెప్పడం గర్హనీయమని అన్నారు.
 
   దివంగత ప్రధానిని ఇంత దారుణంగా ఎవరూ విమర్శిం చలేదని అన్నారు. అన్నాడీఎంకే నేతలంతా ప్రధాని మోదీని తమ భుజాలపై ఎత్తుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా అవినీతి పరురాలని ఆయన విమర్శిం చకుండా వుంటారా అని ఖుష్బూ ప్రశ్నించారు. మోదీ పాలనలో ఏవైనా సాధ్యమేనని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుం టున్నారని, మోదీ హాయంలో మాజీ సైనికుడు ఎన్నికల్లో పోటీ చేయలేరని, అయితే మలేగాన్‌ బాంబు పేలుడు సంఘటనకు సంబంధించిన ఉగ్రవాది బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని ఆమె అన్నారు. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ పాలకులను ఓటర్లు ఈనెల 23న తరిమి కొట్టేందుకు సిద్ధమ య్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదుచోట్ల పోటీచేస్తున్న బీజేపీ అభ్య ర్థులకు డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయమని ఆమె చెప్పారు. తూత్తుకుడిలో పోటీ చేస్తున్న బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ సముద్రంలో తామర పుష్పించడం తథ్యమని చెప్పడం వింతగా ఉందని, ఉప్పునీటిలో తామర ఎలా పుష్పించగలదో ఆమె వివరించాలని ఖుష్బూ అన్నారు. రాష్ట్రంలో డీఎంకే – కాంగ్రెస్‌ కూటమి 35 నుండి 36 స్థానా లను గెలుచుకుంటుందని ఆమె జోస్యం చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *