ఆర్టీసీలో సమ్మె సైరన్‌


  • 9న జేఏసీ నోటీసు
  • సమస్యల పరిష్కారానికి కార్మికుల పట్టు
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపునిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మికుల న్యాయమైన హక్కుల సాధనకు ఈ నెల 9న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, జేఏసీ కన్వీనర్‌ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. 2019 ఫిబ్రవరి 5న రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, చైర్మన్‌ వర్ల రామయ్యతో చర్చలు జరిపినా ఇప్పటికీ తమ సమస్యలు పరష్కరించలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు 25% తాత్కాలిక ఫిట్‌మెంట్‌ కల్పించడంతో పాటు తొలివిడతగా 40% బకాయిలను విడుదల చేస్తామని ఆర్టీసీ రాతపూర్వకంగా అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అయినప్పటికీ బకాయిలను విడుదల చేయకుండా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *