ఆశారాం బాపూ కుమారుడికి యావజ్జీవ కారాగారం


న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తనయుడు నారాయణ సాయికి గుజరాత్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. లక్ష రూపాయల జరిమానాను కూడా సూరత్ సెషన్స్ కోర్టు విధించింది. అత్యాచారం కేసులో నారాయణ సాయిని దోషిగా నిర్దారిస్తూ ఈనెల 26న కోర్టు తీర్పునిచ్చింది. శిక్షను ఇవాళ ఖరారు చేసింది. కాగా, ఈ కేసులో ఇతర నిందితులైన గంగ, జమున, హనుమాన్ అలియాస్ కౌశల్‌కు పదేళ్ల చొప్పున జైలు, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. మరో నిందితుడు రమేష్ మల్హోత్రాకు ఆరు నెలలు జైలు విధించింది. అత్యాచార బాధిత సిస్టర్స్‌లో ఒకరికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా సెషన్స్ కోర్టు తాజా తీర్పులో ఆదేశించింది.
 
ఆశారాం, నారాయణ సామి తమపై అత్యాచారానికి పాల్పడినట్టు సూరత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు 2013లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2002-2005 మధ్య తాను ఆశ్రమంలో ఉన్నప్పుడు నారాయణ సాయి తనపై పదేపదే అత్యాచారం జరిపేవాడని ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు ఆరోపించారు. జోథ్‌పూర్‌లో ఓ ఉత్యాచారం కేసులో ఆశారాంకు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *