ఆ పదివేలు టీడీపీకి పని చేయాలనే.. నేను అనుకుంటున్నాను: ఉండవల్లి



అమరావతి: ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే దానిపై బెట్టింగులూ భారీగానే జరుగుతున్నాయి. అయితే ఫలితాలపై రాజకీయ ఉద్దండులు, సర్వే సంస్థలు చెప్పే వివరాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఫలితాలపై ఓ అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. ఆయనేమన్నారంటే..  ‘‘2014లో జగన్‌కు ఇప్పటి జగన్‌కు తేడా ఏం లేదు. అయితే ఇంప్రూవ్‌మెంట్ ఉంది. రాష్ట్రంలో యువత ఎక్కువగా జగన్‌ వైపే ఉన్నారు. వీటన్నింటికీ మించి.. ఈ సారి జరిగిన ఎన్నికలను ఎక్కడా చూడలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలు ఒక్కొక్కరికీ అకౌంట్లో పదివేలు రూపాయలు వేయడం.. అంతేగాక ఏటా వేస్తానని బాబు చెప్పడం.. టీడీపీకి కలిసి వస్తుంది. ఇది కేవలం పసుపు కుంకుమ మాత్రమేనని.. మిగిలిన వాటితో సంబంధం లేదని బాబు చెప్పడం గమనర్హం. డెఫినెట్‌గా పదివేలు పని చేయాలనే నేను అనుకుంటున్నాను. పని చేసి ఉంటుందనే భావిస్తున్నా. తమకు ఉదారంగా ఇచ్చాడు.. సహాయం చేశాడు అనుకుంటే.. చంద్రబాబుకే మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఓటేస్తారు’’ అంటూ ఫలితాలపై తన మనసులో మాట చెప్పారు.  

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *