ఆ పాచిక వెనుక దీర్ఘ కాలిక వ్యూహమే దాగుంది : జ్యోతిరాదిత్య



మధ్యప్రదేశ్ : యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయడంపై యూపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. అలా ఒంటరిగానే వెళ్లడంపై దీర్ఘకాలిక వ్యూహాలే దాగున్నాయని వెల్లడించారు. 2014 ఎన్నికల కంటే రాష్ట్రంలో మెరుగైన ఫలితాలే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ స్వశక్తితో రాష్ట్రంలో ఎదగడానికి వ్యూహాలు పన్నుతున్నామని, ఆ వ్యూహం నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఫలితాలు వచ్చిన తర్వాత తాము తీసుకున్న నిర్ణయం సరియైనదో, కాదో అనేది చూస్తారని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే ఈ పాచిక వేశామని ఆయన వెల్లడించారు. గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లో చాలా కష్టపడ్డామని, ఆ కష్టానికి ఫలితాన్నిచ్చేది మాత్రం ప్రజలేనని ఆయన అన్నారు. మహాగట బంధన్ తో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోతుందా? అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ… అలాంటిదేమీ లేదని పార్టీ అభ్యర్థుల బలాబలాల మీద ఆధారపడి ఉంటుందని ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *