ఆ పాపకు ‘ఫణి’ పేరు!


  • ఒడిసా రైల్వే ఆస్పత్రిలో చిన్నారి జననం
న్యూఢిల్లీ, మే 3: పెనుతుఫాను ఒడిసాను అతలాకుతలం చేస్తున్న వేళ రైల్వే ఆస్పత్రిలో ఓ గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చింది. రాజధాని భువనేశ్వర్‌కు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచేశ్వర్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం 11.03 గంటలకు పుట్టిన ఆ చిన్నారికి అధికారులు ‘ఫణి’గా నామకరణం చేశారు. ఒకవైపు పెనుగాలులు, మరోవైపు భారీవర్షం దంచికొడుతున్నా వైద్యులు మాత్రం నిబ్బరంగా నిలబడ్డారని, మంచేశ్వర్‌లోని కోచ్‌ రిపేర్‌ వర్క్‌షా్‌పలో హెల్పర్‌గా పని చేస్తున్న ఆమెకు సుఖప్రసవం చేశారని పలువురు కొనియాడారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ పాపను అందరూ లేడీ ఫణిగా పిలుస్తున్నట్లు చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *