ఆ పోలింగ్ కేంద్రాలకు ఏనుగుల ముప్పు… రంగంలోకి అటవీ అధికారులు


కోర్బా: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా లోక్‌సభ సీటు పరిధిలోని రామ్ పూర్, పాలీ-తానాఖార్ ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తుంటాయి. ఈ ప్రాంతాలకు చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు అటవీ ప్రాతం మీదుగా నడిచి వెళ్లాల్సి వస్తుంది. దీంతో వీరంతా ఏనుగులు తమపై దాడి చేస్తాయేమోనని భయపడుతుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి జితేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ తమ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ఏనుగుల కదలికలను గమనిస్తుంటారన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ నుంచి రక్షణకు టెంట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటిని అందుబాటులో ఉంచామన్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *