ఆ మహిళలంతా గులాబీరంగు చీరలతో రోడ్లపైకి వచ్చి…


వారణాసి: యూపీలోని వారణాసిలో మహిళలు ప్రజలకు ఓటు ప్రాధాన్యతను ప్రత్యేకశైలిలో తెలియజేశారు. మహిళలంతా గులాబీరంగు చీరలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకురాలు మంజూవర్మ మాట్లాడుతూ మహిళ‌ల్లో ఓటు హక్కుపై అవగాహన ఏర్పడని పక్షంలో వందశాతం ఓటింగ్ నమోదు కాదన్నారు. అలాగే తగిన సమయంలో మహిళలకు ఓటరు స్లిప్పులు అందజేయాలి. అలాగే ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. అప్పుడే పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి సమస్యలు ఎదురుకావు. మహిళలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయాలన్నారు. తమ ఇళ్లలోని ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావాలన్నారు. కాగా ఈ ర్యాలీలో అంగన్వాడీ కార్యకర్తలతోపాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *