ఆ రెండు చోట్లా కాంగ్రెస్‌నే గెలిపించండి: మాయావతి పిలుపు


లక్నో: కాంగ్రెస్‌కే ఓటెయ్యాలంటూ రాయ్‌బరేలి, అమేథీ ఓటర్లకు బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. బీఎస్పీ-ఎస్పీ-ఆరెల్డీతో కూడిన మహాకూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం ‘విభజించు-పాలించు’ విధానాన్ని అమలు చేస్తున్నాని మాయావతి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో తాము పొత్తు ఎందుకు పెట్టుకోలేదో దేశ ప్రజలందరికీ తెలుసని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్-బీజేపీలు ఒకే నాణేనికి రెండు ముఖాలని విమర్శించారు. రాయ్‌బరేలీ, అమేథీలలో కాంగ్రెస్ గెలిస్తే సోనియా, రాహుల్ గాధీలు ఇద్దరూ దేశంలో ఎక్కడైనా బీజేపీని నిలువరించగలుగుతారని అన్నారు. అందుకనే అక్కడ కాంగ్రెస్ గెలవాల్సి ఉందన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మహాకూటమి ఓట్లు కాంగ్రెస్‌కేనని స్పష్టం చేశారు. బీఎస్పీ కార్యకర్తలందరూ దీనిని పాటించాలని మాయావతి పిలుపునిచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *