ఆ విషయంలో మాత్రం ప్రియాంక స్టైలే వేరు


ఎదుటి వాళ్లు పొగిడితే పడిపోవడం కొందరి నైజం.. కానీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తీరే వేరుగా ఉంది. ఎన్నికల ప్రచారంలో నాయకుల విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రాజకీయ విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీపై ఉమా భారతి నోరు పారేసుకున్నారు. ప్రియాంకను దేశం మొత్తం దొంగ భార్యగా చూస్తోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
 
మోదీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ప్రియాంకపై ఉమాభారతి కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ప్రియాంకపై బీజేపీ నేతలు వ్యక్తిగత కామెంట్లు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లో పెట్టారు. అయితే ప్రియాంక మాత్రం ఇలాంటి విమర్శలపై పెద్దగా స్పందించటం లేదు. రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టేలా ప్రియాంక ముందుకు సాగుతున్నారు. తనపై చేసిన విమర్శలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆమె సక్సెస్ అవుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *