ఇంకెంత దూరం..


  • దుర్గా ఫ్లైఓవర్‌కు ఎండ దెబ్బ..
  • ’వై’ పిల్లర్‌ నిర్మాణంలో మరింత జాప్యం
  • సమ్మర్‌లో సొంతూరుకు స్కిల్డ్‌ లేబర్‌
  • సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణంలో తీవ్ర ఇబ్బందులు
  • కాంట్రాక్టు సంస్థకు రూ. 60 కోట్ల మేర ఆర్థిక కష్టం
కనకదుర్గా ఫ్లై ఓవర్‌.. కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. దేశంలోనే మొదటిసారిగా ‘వై’ పిల్లర్స్‌ పనులు తలకెత్తుకున్న కాంట్రాక్టు సంస్థ సోమా వాటిని పూర్తి చేసే విషయంలో అష్టక ష్టాలు పడుతోంది. గడువులోగా పూర్తి చేయలేక చేతులెత్తేసిన ‘సోమా’కు తాజాగా ఎండదెబ్బ తగిలింది. స్కిల్డ్‌ లేబర్‌ సమ్మర్‌ వెకేషన్‌లో ఉండటం ఇబ్బందిని కలిగిస్తోంది. మొత్తం ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఆరు వై పిల్లర్స్‌ను చేపట్టాల్సి ఉండగా.. ఏడాదిన్నరగా ఈ పనులు సాగుతూనే ఉన్నాయి.
 
విజయవాడ, (ఆంధ్రజ్యోతి): కనకదుర్గా ఫ్లై ఓవర్‌ కష్టాలు ఇన్నీ, అన్నీ కావు. గడువులోగా పూర్తిచేయలేక చేతులెత్తేసిన కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు తాజాగా ఎండదెబ్బ తగిలింది. స్కిల్డ్‌ లేబర్‌ సమ్మర్‌ వెకేషన్‌లో ఉండటం ఇబ్బందిని కలిగిస్తోంది. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ‘వై’ పిల్లర్స్‌ నిర్మిస్తున్న సోమా వీటిని పూర్తి చేయటానికి ఏడాది కాలంగా పడుతున్న కష్టాలు చాలానే ఉన్నాయి. వై పిల్లర్స్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ పూర్తి చేయాలంటే స్కిల్డ్‌ లేబర్‌ ఉన్నా చాలా కష్టం! అలాంటిది వీరు లేకుండా పూర్తిచేయటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు! ఇది ఫ్లై ఓవర్‌ నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక కష్టాలను తెచ్చి పెడుతోంది.
 
కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి సరికొత్త కష్టాలు వచ్చి పడ్డాయి! దేశంలోనే మొదటిసారిగా ‘వై’ పిల్లర్స్‌ పనులు తలకెత్తుకున్న కాంట్రాక్టు సంస్థ సోమా వాటిని పూర్తి చేసే విషయంలో అష్టకష్టాలు పడుతోంది. సాధారణ పిల్లర్లు అయితే ఈ పాటికి పరిస్థితులు వేరుగా ఉండేది. భూగర్భంలో పైపులైన్లు, కృష్ణానది, కృష్ణా తూర్పు ప్రధాన కాలువ, మోడల్‌ గెస్ట్‌ హౌస్‌ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ’వై’ పిల్లర్లను డిజైన్‌లో చేర్చింది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఈ తరహా పిల్లర్ల నిర్మాణం చేపట్టలేదు. తొలిసారిగా ‘సోమా’ సంస్థ ఈ తరహా పిల్లర్లను డిజైన్‌లో చేర్చింది. మొత్తం ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఆరు వై పిల్లర్స్‌ను చేపట్టాల్సి ఉండగా.. ఏడాదిన్నరగా ఈ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి పూర్తి స్థాయిలో రెండు పిల్లర్లు నిర్మించారు. మిగిలిన నాలుగు పిల్లర్లు పురోగతిలో ఉన్నా పూర్తి కాలేదు. ఈ పిల్లర్లపై సూపర్‌ స్ట్రక్చర్‌ తీసుకురావటం అతికష్టం.! సూపర్‌ స్ట్రక్చర్‌లో భాగంగా పిల్లర్‌పై తల, దీనిపై సాధారణ పిల్లర్‌ నుంచి వచ్చే స్పైన్‌ను తీసుకు వెళ్లే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. వై పిల్లర్స్‌ మధ్యన 16 మీటర్ల దూరం పొడవు ఉంటుంది. స్పైన్‌ నిర్మాణం ఎక్కువుగా ఉంటుంది. స్పైన్స్‌ను బిగించటం, వీటికి రెక్కలు బిగించటం ఎంతో క్లిష్టమైన పని! సూపర్‌ స్ట్రక్చర్‌లో భాగంగా చేపట్టే పనులు అత్యంత క్లిష్టమైనవి. ఈ పనులు చేపట్టాలంటే స్కిల్డ్‌ లేబర్‌ ఉంటేనే సాధ్యం!
 
నిధుల కష్టం..
కనకదుర్గ ఫ్లై ఓవర్‌ కాంట్రాక్టు సంస్థకు భారీగా నిధుల కష్టం వచ్చిపడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్‌ పనులకు రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు సంస్థ రూ. కోటి పనులు చేస్తే రూ.2 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా రూ. కోటిన్నర ఆ లోపే బిల్లులు వస్తుండటంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో కాంట్రాక్టు సంస్థ ఉంది.
 

ఎండ తీవ్రతకు స్కిల్డ్‌ లేబర్‌ చలో..
కాంట్రాక్టు సంస్థ వద్ద పనిచేస్తున్న స్కిల్డ్‌ లేబర్‌ చాలామంది సమ్మర్‌ సెలవులకు వెళ్లిపోయారు. బ్లేజ్‌వాడలో పనులు చేయలేమని కొద్ది రోజులు సొంతూళ్లకు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిపోతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కార్మికులకు వేతనాలను చెల్లించలేకపోతున్న ‘సోమా’ సంస్థ గట్టిగా వారిని నియంత్రించలేని పరిస్థితి. ఈ పరిణామం కాంట్రాక్టు సంస్థకు ఇబ్బందికరంగా మారింది. సూపర్‌ స్ట్రక్చర్‌ పనులు మందకొడిగా సాగటంతో ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయన్నది అంతుచిక్కటం లేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *