ఇంట్లోకి చొరబడి వ్యక్తి హత్య


విజయనగరం: జిల్లాలో దారుణం జరిగింది. గరివిడి మండలం కొండపాలెంలో తమ్మిన చినబాబు (45) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు.. చినబాబును దారుణంగా చంపేశారు. ఈ ఘటనతో కొండపాలెం గ్రామం ఉలిక్కిపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *