ఈవీఎంల భద్రతకు.. మూడు బలగాలు


ఎక్కడా.. ఎటువంటి.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. నక్సల్స్‌ కదలికలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలకు భద్రత కల్పించామని ఏలూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సి.ఎం.త్రివిక్రమ వర్మ చెప్పారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డీఐజీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఏలూరురేంజ్‌ పరిధిలోని కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన ఈవీఎంను భద్రపరచిన స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. మా ప్లానింగ్‌ అంతా పనిచేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కూంబింగ్‌ చేయడం వల్ల మావోయిస్టులు, నక్సల్స్‌ కదలికలు లేకుండా చేయగలిగాం. రేంజ్‌ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగాం.
 
డీఐజీ త్రివిక్రమవర్మ
 
రేంజ్‌ ఈవీఎంలు ఇక్కడే…
పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ఇంజనీరింగ్‌ కాలేజీ, రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ, భీమవరంలో ఉన్న విష్ణు కాలేజీలో భద్రపరచడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్శిటీలో భద్రపరచామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జేఎన్‌టీయూ ఇండోర్‌ స్టేడియం, రంగరాయ మెడికల్‌ కాలేజీ లోని అనాటమి భవనం, స్పోర్ట్స్‌ ఆఽథారిటీ భవనం, ఐడీఎల్‌ కాలేజీలోని రెండు ఫ్లోర్లు, ఆదికవి నన్నయ యూనివర్శిటీలోని రెండు ఫ్లోర్లలో ఈవీఎం మిషన్లను భద్రపరిచామన్నారు.
 
మూడంచెల భద్రత..
స్ర్టాంగ్‌రూమ్‌లకు మూడు అంచెల భద్రత కల్పించాం. స్ర్టాంగ్‌ రూమ్‌ల చుట్టూ పారా మిలిటరీ దళాలు ఉంటాయి.. ఆ తర్వాత వారికి కొద్దిదూరంలోనే ఏపీఎస్‌పీ బలగాలు ఉంటాయి.. ఆ తర్వాత బయట వైపు గేట్ల వద్ద సివిల్‌, ఏఆర్‌ పోలీసు బలగాలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ మూడు రకాల బలగాలు వద్ద మూమెంట్‌ రిజిష్టర్లు ఉంటాయని, ఏ అధికారి అయినా లోపలకు ప్రవేశించాలంటే ఖచ్చితంగా సంతకం పెట్టి వెళ్లాలని, వారు తిరిగివచ్చేటప్పుడు కూడా సంతకం పెట్టి రావాల న్నారు. ఈ నెల 16న తూర్పు గోదావరి,17న కృష్ణా,పశ్చిమ గోదావరి జిల్లాల్లోని స్ర్టాంగ్‌ రూమ్‌లను గురువారం పరిశీలించానన్నారు.
 
ప్రశాంతంగా ఎన్నికలు..
ఈ ఎన్నికల్లో రేంజ్‌పరిధిలో మొత్తం 90 కేసులు నమోదు చేసి 500 మంది నిందితులను గుర్తించాం. త్వరలోనే అరెస్టు చేస్తాం. తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న పోలింగ్‌ స్టేషన్‌ నుంచి ఈవీఎంలను హెలికాప్టర్‌ ద్వారా చేరవేశాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం.గత ఎన్నికల్లో రెండు బస్సులను పేల్చేసిన సరివెల్లి, అల్లిగూడెం ప్రాంతాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం. ఎన్నికల తనిఖీల్లో భాగంగా రేంజ్‌ పరిధిలో 14 కోట్ల 84 లక్షల 12 వేల 644 రూపాయలను స్వాధీనం చేసుకున్నాం.
 
రేంజ్‌నకు 15 దళాలు…
ఎన్నికల నిర్వహణలో భాగంగా రేంజ్‌నకు15పారామిలిటరీ దళాలు వచ్చాయి. కృష్ణాజిల్లాకు రెండు,తూర్పుగోదావరిజిల్లాకు 9, పశ్చిమకు నాలుగు దళాలను ఏర్పాటు చేశాం. 24 గంటలూ వీరు విధులు నిర్వర్తిస్తారు.సీసీ కెమెరాలను స్ర్టాంగ్‌ రూమ్‌ల్లోను, బయట, ప్రాంగణం లోను ఏర్పాటు చేశాం. రాత్రివేళ కూడా విద్యుత్‌ వెలుగులకు అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ముందస్తుగా ఫైరింజన్లు కూడా ఆయా ప్రాంతాల్లో ఉంచాం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *