ఉండవల్లిపై సోషల్ మీడియాలో తాజా ప్రచారం ఏంటంటే..


అమరావతి: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన సీఎం చంద్రబాబునే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడంతో వైసీపీకి ఆయన దగ్గరవుతున్నారన్న వార్తలకు బలం చేకూరింది. గతంలోనూ చంద్రబాబుపై విమర్శలు చేసినప్పటికీ తాజా ప్రెస్‌మీట్‌లో విమర్శల స్థాయి మరింత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. మే 23న ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే ఉండవల్లి ఆ పార్టీలో చేరడం ఖాయమనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
 
ఉండవల్లి తన ప్రెస్‌మీట్‌లో సీఎస్ వర్సెస్ సీఎం ఎపిసోడ్‌పై స్పందించిన సందర్భంలో కూడా తప్పంతా సీఎందేనన్న రీతిలో స్పందించడం, చీఫ్ సెక్రటరీ చర్యలను సమర్ధించిన రీతిలో మాట్లాడటంతో ఆయన వైసీపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు, వైసీపీ అధికారంలోకి వస్తే ఉండవల్లి చేరిన వెంటనే ఆయనకు కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా తాజా ప్రెస్‌మీట్‌తో ఉండవల్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *