ఉగ్రవాదులకు నేరుగా ఐలవ్‌యూ చెప్పండి : అమిత్‌షా


పట్నా : ఉగ్రవాదాన్ని అణచివేసే వరకు పాకిస్తాన్‌తో చర్చల ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తేల్చిచెప్పారు. పట్నాలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ పాకిస్తానీ ఉగ్రవాదంపై రాహుల్ గాంధీ మెతక వైఖరి అవలంబించే కంటే నేరుగా ఐ లవ్‌యూ, ఐలవ్‌యూ అనడమే మంచిదని దెప్పిపొడిచారు. పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదుల విషయంలో మోదీ ప్రభుత్వం ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పీచమణిచే వరకు చర్చల అంశమే ఉత్పన్నం కాదని షా తెలిపారు. బీజేపీకి దాని మిత్రపక్షాలకు దేశ రక్షణ, భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని ఆయన స్పష్టం చేశారు.
 
భారత దళాలు తీవ్రవాద స్థావరాలపై చేసిన దాడులపై కొందరు ఆధారాలు అడుగుతున్నారని అలాంటి వారికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. యూపీఏ హయాంలో బిహార్ అభివృద్ధికి ఎన్నడూ నిధులను మంజూరు చేయలేదని, కానీ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 6,06,000 రూపాయల నిధులను కేటాయించిందని వివరించారు. వీటి ద్వారానే సీఎం నితీశ్ బిహార్‌ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నారని అమిత్‌షా కొనియాడారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *