ఉదయం నుంచీ సచివాలయంలోనే చంద్రబాబు


అమరావతి: ‘ఫణి’ పెను తుపాను తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో ‘అల’జడి నెలకొంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన సమీక్ష సాయంత్రం వరకూ జరుగుతూనే ఉంది.
 
ఇవాళ ఉదయం నుంచి సచివాలయంలోనే చంద్రబాబు ఉన్నారు. ‘ఫణి’ తుపాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాబు ఆరా తీస్తున్నారు. ప్రతి గంటకు తుపాన్ పరిస్థితిని ఆర్టీజీఎస్ సీఈవో బాబు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ సీఎంకు వివరిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంకు 159 కిలోమీట‌ర్ల దూరంలో.. తూర్పు ఆగ్నేయ దిశ‌గా ‘ఫణి’ సైక్లోన్ కేంద్రీకృతమైనట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందస్తు జాగ్రత్త చర్యలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పూరి వద్ద తుపాన్ తీరాన్ని దాటనున్నది. తుపాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల్లో గంటకు 130 నుంచి 140 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *