ఉపపోరుకు అంతా రెఢీ


బెంగళూరు: ధార్వాడ జిల్లాలోని కుందగోళ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపంసహరణ అనంతరం అంతిమంగా 8 మంది అభ్యర్థులు బరిలో దిగారు. దివంగత మంత్రి శివళ్ళి సతీమణి కుసుమావతి కాంగ్రెస్‌ అభ్యర్థిగాను, మాజీ ఎమ్మెల్యే చిక్కనగౌడర బీజేపీ అభ్యర్థిగాను తలపడుతున్నారు. ఇదిగాక భవండివాడ ఈశ్వరప్ప శెట్టప్ప, తుళసప్ప కరియప్ప దాసర, రాజు అనంసనాయక్‌వాడి, గోని శైలా సురేష్‌, సిద్దప్ప, సోమణ్ణలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మే 19న ఇక్కడ ఉప ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే.
 
ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే జరగనుంది. ఇక గుల్బర్గా జిల్లాలోని చించోళి శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అంతిమంగా 17 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరుపున సుభాష్‌ వి.రాథోడ్‌, బీజేపీ తరుపున డాక్టర్‌ అవినాష్‌, ఉమేష్‌ జాథవ్‌, బహుజన సమాజపార్టీ తరుపున గౌతమ బొమ్మళ్ళి తపడుతుండగా మిగిలిన అభ్యర్థులు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి కూడా మే 19న ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొనివుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *