ఉమాభారతిని చూసి బోరున ఏడ్చిన సాధ్వి ప్రగ్యా సింగ్…!


భోపాల్: బీజేపీ సీనియర్ నేత, సాధ్వి ఉమాభారతిని కలుసుకున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి, మరో సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాగూర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆమెను ఆలింగనం చేసుకుని బోరున ఏడ్చారు. ఉమాభారతిని దర్శించుకునేందుకు సాధ్వి ప్రగ్యా సింగ్ ఇవాళ ఆమె నివాసానికి వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సమావేశం ముగించుకుని ప్రగ్యాసింగ్ తిరిగి వెళ్తుండగా ఆమెను సాగనంపేందుకు ఉమాభారతి కూడా వచ్చారు. ఆమెను కారు ఎక్కించి, సీటులో దిండు వేసి కూర్చోబెట్టారు. కాళ్లకు మొక్కి నమస్కరించారు. ఈ సందర్భంగా ప్రగ్యాసింగ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.  వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమెను చూసి ఉమాభారతి కూడా భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ఆమెను ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయారు. ప్రగ్యాసింగ్‌ను ఓదార్చి ధైర్యం చెప్పి పంపారు.
 
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉమాభారతికి బదులుగా ఆమె నియోజకవర్గమైన భోపాల్‌ నుంచి ప్రగ్యా సింగ్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో నిన్న ఉమాభారతి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆమె గొప్ప సన్యాసిని. ఆమెను నాతో పోల్చవద్దు. నేను సాధారణమైన వ్యక్తిని. తెలివితక్కువ దాన్ని..’’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఉమాభారతి స్థానాన్ని సాధ్వి భర్తీ చేయబోతున్నారా అని మీడియా అడిగినప్పుడు ఈమేరకు ఆమె స్పందించారు. ఈ నేపథ్యంలోనే సాధ్వీ ప్రగ్యాసింగ్ ఉమాభారతితో సమావేశం కావడం గమనార్హం. భోపాల్ పార్లమెంటు నియోజకవర్గంలో సాధ్వి ప్రగ్యాసింగ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తో పోటీ పడుతున్నారు. 
 
వీడియో సౌజన్యం : ఓటీవీ 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *