ఉరుములతో వర్షాలు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పాడి, దాని నుంచి కర్నాటక వరకు ద్రోణి కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా వడగళ్లు పడ్డాయి. ఆదివారం ఉదయంతో ముగిసిన 24 గంటల్లో వెంకటగిరిలో 11, ఎస్‌.కోటలో ఆరు, మెంటాడలో ఐదు, బొబ్బిలి, సీతానగరం, పొదిలిలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తరువాత వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *