ఎందుకు కొట్టానో తెలియదు.. కేజ్రీవాల్‌పై దాడిచేసిన వ్యక్తి ప్రశ్చాత్తాపం!


న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడిన సురేష్ అనే వ్యక్తి తాను చేసిన పనికి ప్రశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన వెనుక ఎవరూ లేరనీ… అసలు ఆయనను ఎందుకు కొట్టానో కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు. ‘‘ఆయనను (కేజ్రీవాల్) ఎందుకు కొట్టానో కూడా నాకు తెలియదు. అలా కొట్టినందుకు చింతిస్తున్నా..’’ అని సురేశ్ పేర్కొన్నాడు. తాను ఏ పార్టీ కోసం పనిచేయడం లేదని చెప్పుకొచ్చాడు.
 
‘‘నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కేజ్రీవాల్‌ని కొట్టమని ఎవరూ నాతో చెప్పలేదు. అరెస్టు తర్వాత పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేను తప్పు చేశానని మాత్రమే వారు చెప్పారు…’’ అని సురేశ్ పేర్కొన్నాడు. ఈ నెల 4న వెస్ట్ ఢిల్లీలోని మోతీ నగర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్‌పై సురేశ్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓపెన్‌ టాప్ జీపులో వెళుతూ ప్రజలకు కేజ్రీవాల్ అభివాదం చేస్తుండగా.. ఎర్రటి టీ షర్టు ధరించిన సురేశ్ ఆ వాహనంపైకి ఎక్కి కేజ్రీవాల్ ముఖంపై కొట్టాడు. ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు వెంటనే అతడిని కిందికి దింపి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించడంతో అతడిపై కేసు నమోదు చేసి విచారన జరుపుతున్నారు. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *