ఎనిమిదేళ్ల బాలుడి కడుపులో పిండం!


జైపూర్‌, ఏప్రిల్‌ 18: ఆ పిల్లాడి వయసు ఏనిమిదేళ్లు. కొంతకాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు తొలుత అది మూమూలు నొప్పిగానే భావించి మాత్రలు వాడించారు. వాటికి నొప్పి తగ్గకపోగా, మరింత తీవ్రం అవుతుండటంతో చురులోని దీనదయాళ్‌ మెడికల్‌ కాలేజీ వైద్యులను ఆశ్రయించారు. అతడి పొట్టలో మరో పిండం ఉండటం చూసి వైద్యులు షాకయ్యారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. పిండం కణితిలా మారి పెరుగుతుండటంతో బాలుడి ప్రాణాలకు ప్రమాదమని తేల్చిన వైద్యులు, 6గంటల పాటు సర్జరీ నిర్వహించి దాన్ని బయటికి తీశారు. బాలుడి రక్తనాళాలు పిండానికి అతుక్కుని ఉండటంతో అతడి శరీరంలో ఎదుగుతోందని వైద్యులు చెప్పారు. జీవరహితమైనప్పటికీ.. దానిలో జుట్టు, ఎముకలు, కపాలం ఉండటం గమనార్హం. తల్లి కడుపులో ఉన్నప్పుడు రెండు పిండాలు కలిసిపోయాయని వైద్యులు వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *