ఎన్నికల నిర్వహణలో వైఫల్యం: అయ్యన్న



శృంగవరపుకోట రూరల్‌, మే 8: ‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకీ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఘెరంగా విఫలమైంది. మనరాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి’ అని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఇంతటి వైఫల్యాలను తానెప్పుడూ చూడలేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం సమీక్షలు నిర్వహిస్తే అడ్డుచెప్పడం సరికాదన్నారు. ప్రధాని, కేసీఆర్‌ సమీక్షలు నిర్వహిస్తే అడ్డుపడని ఈసీ ఏపీపై వివక్ష చూపుతోందన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *