ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేత… మహిళల చేతికి చిక్కడంతో…


పట్నా: బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఎన్డీఏ తరపున ప్రచారానికి వచ్చిన జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్యే మన్జీత్ సింగ్ చేదు అనుభవం ఎదురైంది. ఎంతో ఉత్సాహంగా ప్రచారానికి వచ్చిన ఆయనకు గ్రామంలో ప్రవేశించేందుకు అనుమతి లభించలేదు. గోపాల్‌గంజ్ లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు మన్జీత్‌సింగ్ జోగిరియా వచ్చారు. అయితే అతనిని పలువురు మహిళలు అడ్డుకున్నారు. తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ ఆందోళనకు దిగారు. దీంతో మన్జీత్‌సింగ్ ర్యాలీ నిర్వహించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. గ్రామంలోని రోడ్లన్నీ పాడైపోయాయని, అటు కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు నితీష్ ప్రభుత్వం గానీ వీటిని గురించి పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా గత ఏడాది వచ్చిన వరదలు, వర్షాల కారణంగా ఇక్కడి రోడ్లన్నీ పాడైపోయాయి. అప్పటి నుంచి గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *