ఎన్నేళ్లకు..ఎన్నాళ్లకు..!


  • 22 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులు – జ్ఞాపకాలను నెమరేసుకున్న వైనం
బెంగళూరు, బళ్లారిరూరల్‌: వారంతా 22 ఏళ్ల క్రితం విద్యార్థులు. ఇన్నేళ్ల తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. స్థానిక సరళాదేవి సతీశ్‌చంద్ర అగర్‌వాల్‌ ప్ర భుత్వ డిగ్రీకళాశాలలో సోమవారం పూర్వ వి ద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1997లో బీకాం విద్యార్థులు ‘స్నేహసంగమ మరియు గురువందనా’ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయమని కళాశాల ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ముతాలిబ్‌ అన్నారు. 22 ఏళ్ల తర్వాత ఒకేచోట చేరిన విద్యార్థులు తమను గుర్తుంచుకొని ఉపాన్యాసకులను, కళాశాలను మరిచిపోకుండా పలకరించడానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఉపాన్యాసకుడు తమ విద్యార్థుల ఉన్నతికి శ్రమిస్తారని, దీన్ని సద్వినియోగం చేసుకొన్న విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకొంటారన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, తెలుగు పండితులు జి.ఆర్‌.వెంకటేశులు మాట్లాడుతూ 22 ఏళ్ల తర్వాత తమను గు ర్తుంచుకొని సన్మానం చేసిన విద్యార్థులు మ రింత ఉన్నత స్థితిలో పదిమందికి సాయం అందించేలా ఎదగాలన్నారు.
 
ఈసందర్భంగా ప్రస్తుత కురుగోడు ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొ.ఎ్‌స.నారాయణప్ప, మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొ.డి.ఇందిరా, తెక్కలకోట కళాశాల ఉపాన్యాసకుడు డా.మానకరి శ్రీనివాసాచార్య, సహాయక ఉపాన్యాసకులు జబీనా సుల్తాన్‌, డా.ఎ్‌స.ఎం.శైలతా, సి.దేవణ్ణ, డా.జిలాన్‌భాషా, జయలక్ష్మి తదితరులు పా ల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 1997వ సంవత్సరం బ్యాచ్‌లోని విద్యార్థుల్లో కొందరు కర్ణాటక విశ్వవిద్యాలయం ఉపాన్యాసకులు డా.రామాంజనేయులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాన్యాసకుడు గురుబసప్ప, హరిహర రైల్వేస్టేషన్‌మాస్టర్‌ శ్రీనివాస్‌, పోస్టల్‌శాఖ అసిస్టెంట్‌ సూపరింటెండ్‌ చిదానంద పద్మసాలి, ఆంధ్రబ్యాంకు అధికారి తో పాటు బాలరెడ్డి, చంచణ్ణ, గౌరి, లలితా, గౌరి, శోభా, శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడుతూ ఆనాడు ఉపాన్యాసకులు చెప్పే పాఠాలను శ్రద్ధగ ఆలకించి, శ్రమించినందువల్లనే నేడు ఉన్నతస్థితిలో ఉంటూ గౌరవాభిమానాలు పొందుతున్నామని, ప్రతి విద్యార్థికి ముందు విద్య, అతర్వాత నే ఆటపాట అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *