ఎన్‌హెచ్‌-216 భూసేకరణ తుది దశకు..


  • నగరం, భట్టిప్రోలు మండలాల్లో 52 ఎకరాల సేకరణకు సంప్రదింపులు
  • మే 12వ తేదీకి పూర్తి చేయాలని కలెక్టర్‌ డెడ్‌లైన్‌
  • నిర్వాసితులతో చర్చలు జరుపుతున్న జేసీ-2 సత్యన్నారాయణ
గుంటూరు (ఆంధ్రజ్యోతి): కత్తి పూడి – ఒంగోలు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)-216 భూసేకరణ చివరి దశ జిల్లాలో ఓ కొలిక్కివస్తోంది. సార్వత్రిక ఎన్ని కల కారణంగా ఇంచుమించు రెండునెలలకు పైగా భూసేకరణను పెండింగ్‌లో పెట్టిన అధి కారులు ఎట్టకేలకు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశాలతో తిరిగి ప్రక్రియని ప్రారంభించారు. రెండో దశలో సేకరించాల్సిన భూములను మే 12వ తేదీలోపు పూర్తి చేసి మొత్తం భూమిని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు స్వా ధీనపరచాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జేసీ-2 సత్యన్నారాయణ కొన్ని రోజుల నుంచి ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, భూములు కోల్పోయే నిర్వాసితులను పిలిపించి సంప్రదింపులు జరుపుతున్నారు. నిర్ణీత గడువు తేదీలోపు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వారు చెబుతున్నారు. ఎన్‌ హెచ్‌-216 జిల్లాలోని ఏడు మండలాల మీదుగా ఏర్పాటై ఉంది.
 
ఎన్‌హెచ్‌-16కి ఇది ప్ర త్యామ్నాయంగా ఉంటోంది. ఏ కారణం చేత నైనా గుంటూరు, విజయవాడలో ఎన్‌ హెచ్‌-16పై సమస్య తలెత్తితే ఒంగోలు వద్ద నుంచి ఎన్‌హెచ్‌-216లోకి దారి మళ్లిస్తారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితమే ఈ రహదారి విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చే సింది. జిల్లాలో పిట్టలవానిపాలెం, నగరం, భట్టి ప్రోలు, చెరుకుపల్లి, రేపల్లె, బాపట్ల మండలాల మీదుగా ఈ రహదారి ఉన్నది. దీనిని నాలుగు వరసలుగా విస్తరించబోతున్నారు. తొలిదశలో 250.53 ఎకరాల భూమిని సేకరించారు. రెండో దశలో నగరం, భట్టిప్రోలు మండలాల్లో 51.51 ఎకరాల భూమిని సేకరించేందుకు ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్‌లు జారీ చేశారు. ప్ర స్తుతం అవార్డుల జారీ దశలో భూసేకరణ ప్ర క్రియ ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా కన గాల, చందోలు, బాపట్ల, రేపల్లె వద్ద బైపాసు రోడ్లను కూడా నిర్మించబోతున్నారు. దీని వలన ఆయా మండల కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న ట్రా ఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. భూ సేకరణ కింద భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగానే ఉన్నా ధర నిర్ణయం విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని ఒక కొలి క్కి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు చేప ట్టారు. జేసీ-2 ఎన్నికలకు ముందే జిల్లాకు రావ డం, అలానే తహసీల్దార్లు బదిలీ అయి కొత్త అధికారులు రావడం వలన ఎన్‌హెచ్‌-216 భూసేకరణపై అవగాహన పెంచుకొనేందుకు కొంత సమయం పట్టింది. మరోవైపు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి ఇవ్వాలని జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఓట్ల లెక్కింపునకు 25 రోజుల సమయం ఉన్న నేప థ్యంలో రెండు వారాల వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జేసీ-2 చర్యలు చేపట్టారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *