ఎఫ్‌డీసీ కాఫీ తోటలు గిరిజనులకే: మావోయిస్టులు


విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)కు చెందిన కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టు పార్టీ అధికారులకు హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. 5 రోజుల కిందట విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పార్టీ అగ్రనేత చలపతి, అతని భార్య అరుణ… స్థానిక గిరిజనులతో సమావేశమైనట్టు సమాచారం. ఏపీఎ్‌ఫడీసీకి చెందిన కాఫీ తోటలను స్థానిక గిరిజనులకు అప్పగించి సంస్థ ఉద్యోగులు, అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మావోయిస్టు నేతలు ఈ సమావేశం ద్వారా హెచ్చరించినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. గూడెంకొత్తవీధి మండలం ఆర్‌వీనగర్‌ తూర్పు, పశ్చిమ డివిజన్ల పరిధిలో ఏపీఎ్‌ఫడీసీకి 1920 హెక్టార్లు, చింతపల్లి ఉత్తర, దక్షిణ డివిజన్‌లో సుమారు వెయ్యి హెక్టారుల్లో కాఫీ తోటలు ఉన్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *