ఎఫ్‌సీఐ గోదాములో మంటలు


  • కాలిబూడిదైన 6 వేల బస్తాల బియ్యం
కర్లపాలెం, మే 6: గుంటూరు జిల్లా కర్లపాలెం పంచాయతీ పరిధి నల్లమోతువారిపాలెం సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో సోమవారం రాత్రి మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం గురించి స్థానిక సిబ్బంది అగ్నిమాపకశాఖాధికారులకు సమాచారం అందించారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా గోదాములో మంటలు వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోదాముల్లో పెద్దసంఖ్యలో ఉన్న ధాన్యం బస్తాల్లో సుమారు 6 నుంచి 7వేల బియ్యం బస్తాలు కాలిబుడిదయ్యాయని బాపట్ల అగ్నిమాపకశాఖాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాపట్ల, చీరాల అగ్నిమాపక శకటాల ద్వారా మంటలను పూర్తిగా అదుపులోకి తేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎంత నష్టం వాటిల్లిందనే విషయం తెలియరాలేదని పూర్తిస్థాయి సమాచారం మంగళవారం వెల్లడిస్తామని గోదాముల మేనేజర్‌ మూర్తిరాజు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోదాముల వద్దకు చేరుకున్నారు. కూలీలు, యువకులు మంటలను అదుపు చేయటానికి ప్రయత్నించారు. అయితే మంటల వేడిమికి తట్టుకోలేక వెనకడుగు వేశారు.  

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *