ఎమ్మెల్యేల విషయంలో మోదీపై మండిపడ్డ ముఖ్యమంత్రి


న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీల మధ్య పరస్పరం విమర్శలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మెదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరత పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పద్ధతి ప్రజాస్వామ్యంలో ఉంటుందా? అని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా మోదీని ప్రశ్నించారు.
 
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న కేంద్రమంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి ఖండించారు. తమ పార్టీ ఎమ్మెల్యేకు ఎంత మొత్తంలో డబ్బును ఆఫర్ చేశారో చెప్పాలన్న ఆయన.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.
 
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి విజయ్ గోయల్ గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా గోయల్ వ్యాఖ్యలను ఖండించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *