ఎయిర్ ఇండియా సర్వర్‌ను పునరుద్ధరించాం: సీఎండీ ప్రకటన


న్యూఢిల్లీ : శనివారం తెల్లవారుజామున డౌన్ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన సర్వర్ ను పునరుద్ధరించామని ఆ సంస్థ సీఎండీ అశ్వనీ లోహాని చెప్పారు. ఎయిర్ ఇండియా ఎస్ఐటీఏ సాప్ట్‌వేర్ లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ఉదయం 8.45 గంటల వరకు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగిందని అశ్వనీ చెప్పారు. ఎయిర్ ఇండియా సాంకేతిక నిపుణుల బృందం డౌన్ అయిన సర్వర్ ను పునరుద్ధరించిందని ఆయన చెప్పారు. శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి సర్వర్ డౌన్ కావడంతో అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసుల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సర్వర్ డౌన్ వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. మొత్తంమీద ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్ ప్రభావం ఈ రోజు సాయంత్రం వరకు విమానాల రాకపోకలపై ప్రభావం చూపించనుంది. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *