ఎస్పీవై ఇంట్లో సీబీఐ తనిఖీలు నిజమే!


  • రుణమిచ్చిన బ్యాంకు ఫిర్యాదు
  • నంది గ్రూపుపై బెంగళూరులో కేసు
నంద్యాల, ఏప్రిల్‌ 28: కర్నూలు జిల్లా నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు నిజమేనని స్పష్టమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆయనకు చెందిన నంది గ్రూపు సంస్థల యజమాన్యంపై ఓ కేసు నమోదైంది. నంది సంస్థలకు భారీగా రుణం ఇచ్చిన ఓ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. దీని విచారణలో భాగంగా ఎస్పీవై ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి సీబీఐ అనుమతి తీసుకుంది. నంద్యాలలోని ఎస్పీవై ఇంటికి సీబీఐ అధికారుల బృందం శనివారం చేరుకుని అరగంట పాటు సోదాలు నిర్వహించింది. అంతకుముందు ఈ బృందం కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిసి సహకారం కోరారు. దీంతో సహకరించాలని స్థానిక పోలీసులను ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఇంట్లో లభించిన కీలక పత్రాలను సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఎస్పీవై రెడ్డి కుటుంబం ఈ విషయంపై స్పందించలేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *