ఏఎంఎంకే నాయకుడి దారుణహత్య


చెన్నై: తిరుచ్చిలో అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎం ఎంకే) ప్రముఖుడు దారుణ హత్యకు గురయ్యాడు. మేల్‌కాల్‌పన్నరక్‌ కోడైపన్నై వాసల్‌ వీధికి చెందిన జాకీర్‌హుసేన్‌ ఏంఎంఎకే పొన్‌మలై ప్రాంత మైనారిటీ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం రాత్రి జాకీర్‌ ఆ ప్రాంతం లో వాకింగ్‌కు వెళుతుండగా గుర్తుతెలి యని ముఠా అతడిని అడ్డుకుని దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ముఠా పరారయ్యింది. పొన్‌మలై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలి స్తున్నారు. విషయం తెలుసుకున్న పార్టీ మద్దతుదారులు రాజకీయ కక్ష కారణం గానే జాకీర్‌ హత్య జరిగిందని, నిందితు లను అరెస్టుచేయాలని డిమాండ్‌తో రాస్తారోకోకు దిగారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *